రాచర్ల మండలంలో గేదెపై పెద్దపులి దాడి

రాచర్ల మండలంలో గేదెపై పెద్దపులి దాడి

ప్రకాశం: రాచర్ల మండలంలోని అనుముల పల్లె లింగమయ్య కొండ సమీపంలో ఓ గేదెపై పెద్దపులి దాడి చేసి చంపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మేతకు వెళ్లిన గేదెపై పెద్దపులి దాడి చేయడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గేదె యజమాని ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.