VIDEO: 'ట్రాఫిక్ పోలీసులు వేసవి కాలంలో జాగ్రత్తలు పాటించాలి'
GNTR: ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసుల బాధ్యత ఎంతో కీలకమైందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అలాంటి ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా దాతల సాయంతో గురువారం సమ్మర్ ప్రొటెక్షన్ కిట్లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు రక్షణ చర్యలు పాటిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.