విష జ్వరాల కలకలం.. ఐదేళ్ల చిన్నారి మృతి

విష జ్వరాల కలకలం.. ఐదేళ్ల చిన్నారి మృతి

PLD: వాతావరణ మార్పుల వల్ల పల్నాడు జిల్లాలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గుతో ప్రారంభమై గొంతు నొప్పితో కూడిన జ్వరంగా మారుతున్న ఈ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఐదేళ్ల నాగలక్ష్మీ అనే చిన్నారి విష జ్వరంతో మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.