VIDEO: ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరికలు
KRNL: చిప్పగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హలహర్వికు చెందిన కమ్మ సామాజికవర్గం నుంచి టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే విరుపాక్షి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి చెంది వైసీపీలోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు.