చెవిలో పూలు పెట్టుకుని BRS MLAల నిరసన
TG: అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌కు నిరసనగా BRS ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అర్థం వచ్చేలా.. BRS ఎమ్మెల్యేలంతా తమ చెవులలో పూలు పెట్టుకుని సభ నుంచి వాకౌట్ చేశారు.