జిల్లా కలెక్టర్‌గా వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ

జిల్లా కలెక్టర్‌గా వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ

బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ఉదయం 8 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పని చేస్తున్న వెంకట మురళి బదిలీ కావడంతో వినోద్ కుమార్ బాపట్ల జిల్లాకు వచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరవేయడానికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన చెప్పారు.