ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్పీ

మహబూబాబాద్: ఇసుక రవాణాదారుని బట్టలూడదీసి కొట్టిన ఘటన కేసముద్రంలో జరిగింది. ఇసుక రవాణా చేస్తున్న లారీ డ్రైవర్‌ని ఇద్దరు ఖాకీలు నడిరోడ్డు మీద బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానుష ఘటన గురువారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసముద్రం మండల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సాంబయ్య, వీరన్నను ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ సస్పెండ్ చేశారు.