డ్వాక్రా మహిళలకు సర్కారు గుడ్‌న్యూస్

డ్వాక్రా మహిళలకు సర్కారు గుడ్‌న్యూస్

AP: డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో స్త్రీనిధి రుణాలపై 12%, బ్యాంకు లింకేజీ రుణాలపై 13% వడ్డీ వసూలు చేసేవారు. తాజాగా, వడ్డీ రేట్లపై 2% రాయితీ ప్రకటించింది. దీంతో స్త్రీనిధి 10%, లింకేజీ రుణాలపై 11% చెల్లించాలి. పావలా వడ్డీ కింద గతంలో రూ.3 లక్షల వరకు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేది. కొత్త నిర్ణయంతో ఎంత రుణం తీసుకున్నా 2% రాయితీ వర్తిస్తుంది.