గోపాలపల్లి గుట్టపై మాస కళ్యాణం
NLG: నార్కెట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఈరోజు మాస కళ్యాణం ఘనంగా జరిగింది. ఈవో చిట్టెడి వెంకటరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, రాజేశ్వరి దేవి, పలువురు దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు.