సాగునీటి సమస్యకు పరిష్కారం
SDPT: దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి సర్పంచ్ పెరమండ్ల నర్సింలు కొత్త బోర్ మోటార్ను ప్రారంభించారు. ఎండల తీవ్రతతో గ్రామంలో నీటి కొరత ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మోటార్ ఏర్పాటుతో నీటి ఇబ్బందులు తొలగడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచు కృతజ్ఞతలు తెలిపారు.