కొండపి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ బదిలీ
ప్రకాశం: కొండపి సీఐ సోమశేఖర్ చీరాల వన్ టౌన్ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. కొండపిలో సోమశేఖర్ బాధ్యతల చేపట్టాక నేరాలు కట్టడి చేయడంతోపాటు, పేకాట బెట్టింగులపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి కృషి చేశారు. ఆయన సర్వీస్ కాలంలో అందరి అభిమానాలు పొందారు. సర్కిల్ పరిధిలో సమస్యలను పరిష్కరించడంలో మంచిపేరు తెచ్చుకున్నారు.