జమ్మిచేడు జమ్ములమ్మ అద్భుత రూపం
GDWL: జిల్లా ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి జమ్ములమ్మ అమ్మవారు అని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మంగళవారం కావడంతో జిల్లా కేంద్ర సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జమ్ములమ్మ ఆలయం భక్తులు, అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అమ్మవారికి కృష్ణానది జలాలతో అభిషేకాలు, ఆకు పూజ, హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.