మత్తు అనేక సమస్యలకు దారితీస్తుంది: ఈడీ

HYD: జలమండలి ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్ పాల్గొని ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలన్నారు.