ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ పీ. సౌమ్యలతను కలిసి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, శాలువా, మొమెంటోతో సత్కరించారు. అనంతరం జిల్లా కాన్ఫరెన్స్ హాలులో మహిళా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు అధికారులు, సిబ్బందిని శాలువాతో సత్కరించి, మిఠాయిలను పంచారు.