మెగా PTMను సంక్రాంతి శోభగా నిర్వహణ

మెగా PTMను సంక్రాంతి శోభగా నిర్వహణ

AKP: మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం సూచించారు. తల్లిదండ్రులంతా పాల్గొనేలా విద్యా సంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి తల్లిదండ్రికి ఆహ్వాన పత్రికలు చేరేలా చూడాలని ఆమె అన్నారు. విద్యార్థుల ప్రతిభ,సామర్థ్యాలను ప్రదర్శించేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారి సూచించారు.