నార్పలలో అత్యధిక వర్షపాతం నమోదు
ATP: జిల్లాలో గత 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు ఉదయం వరకు అత్యధికంగా నార్పల మండలంలో 46.6 మి.మీ వర్షపాతం నమోదైంది. రాప్తాడులో 36.2, బుక్కరాయసముద్రంలో 29.0 మి.మీ వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 8.6 మి.మీగా రికార్డైంది. మొత్తంగా జిల్లాలోని 32 మండలాలకు గాను 24 మండలాల్లో వర్షం పడిందని అధికారులు తెలిపారు.