పారిశుద్ధ్య సిబ్బందిపై కమీషనర్ ఆగ్రహం

పారిశుద్ధ్య సిబ్బందిపై కమీషనర్ ఆగ్రహం

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌ ఎల్.రామలక్ష్మి గురువారం పట్టణంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్దానిక సంగవీధిలోని రోడ్లుపై చెత్త, కాలువలలో పూడికలు ఉండడంతో పారిశుద్ధ్య విభాగం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.