VIDEO: అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
E.G: బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ దేశానికి దిశా దశ చూపించారన్నారు.