పేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఛైర్మన్

పేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ  చేసిన ఛైర్మన్

TPT: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిదేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, లంకమిట్ట ఎస్టీ కాలనీలో పేద గిరిజన మహిళలకు చీరల పంపిణీ చేశారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో APSHDC ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.