పోర్టు స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు

పోర్టు స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు

VSP: పోర్టు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్‌లో వాకర్స్‌తో కలిసి బీచ్ వాకింగ్ నిర్వహించారు. అనంతరం వైఎంసీఏ యూత్ హాస్టల్ వద్ద జరిగిన సమావేశంలో సీనియర్ మహిళా వాకర్స్ భారతి, రమణి, మాలతి, సునీతలను సన్మానించారు.