వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. గురువారం అచ్యుతాపురం క్యాంపు కార్యాలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేనలోకి చేరారు. వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు