లాలాగూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం

HYD: లాలాగూడ పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. లాలాగూడ పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడకు చెందిన మీర్జా మజీద్ కుమార్తె షిరీన్ బేగం (27) సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈనెల 18న ఇంటి నుంచి డ్యూటీకని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.