'ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలి'

'ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలి'

RR: రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చకుండా, నిబంధనను అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఫరూఖ్ నగర్ మండల సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారికి AISF రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయాలను నిలిపివేయాలన్నారు.