మోగల్లులో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం
W.G: పాలకోడేరు మండలం మోగల్లులో మంగళవారం మిలియన్ లీటర్ల మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని శివారు గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లోనూ ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.