నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు
MDK: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సివిల్ సప్లయ్, మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖ, డీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 69 రైస్ మిల్లుల వద్ద రెవెన్యూ ఆఫీసర్ నియమించి దిగుమతి అయ్యేవిధంగా పర్యవేక్షణ చేయాలన్నారు.