గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆది కర్మయోగి పథకం: ఎంపీడీవో

KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని ఎంపీడీవో అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో సేవలను మెరుగుపరచడం, గిరిజన సంస్కృతిని సంరక్షించడం, స్థానిక ప్రజలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలన్నారు.