'తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి'
KDP: చాపాడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను అధికారులు పరిశీలించి, వారికి ప్రభుత్వ సహాయం అందించాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ కోరారు. శుక్రవారం, చాపాడు తాసీల్దారును రైతులతో కలిసి రైతు సేవా సమితి చాపాడు మండల అధ్యక్షుడు బసీరెడ్డిపల్లి రామాంజయానేయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.