అంగరంగ వైభవంగా ఆరాధన మహోత్సవాలు

ప్రకాశం: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మార్కాపురంలోని ఆకుల వారి బజారులో వెలసియున్న శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.