ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా ట్రై సైకిళ్ళ వితరణ

KMM: అంగవైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని.. దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ. కమల్ పాషా అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ఆరుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్ళను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు.