తిరువూరు సుగాలి కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు
NTR: తిరువూరు నగర పంచాయతీ పరిధిలోని తొమ్మిదవ వార్డు సుగాలి కాలనీలో వీధి లైట్లు వెలగడం లేదని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ లోకేష్ దత్తుకు ఫిర్యాదు ద్వారా సమస్యను తెలియపరచారు. దీంతో వార్డులో రెండు కొత్త కరెంటు లైట్లు బుధవారం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.