'మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
SRD: సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డులో మాజీ కౌన్సిలర్ సరిత-తులసీరాం ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ మాసం సోదరభావాన్ని పెంపొందిస్తుందని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆమె రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.