‘బీజేపీ నేతలకు అదానీ, అంబానీపైనే ప్రేమ ఉంటుంది’
BHNG: కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్యుల కోసమే పనిచేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. బీజేపీ నేతలకు అదానీ, అంబానీపైనే ప్రేమ ఉంటుందని ఎద్దేవ చేశారు. సామాన్యులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.