గాయపడిన కార్యకర్తను పరామర్శించిన మెట్టు గోవిందరెడ్డి

ATP: కనేకల్ మండలంలోని అంబాపురం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వార్డు సభ్యుడు చిక్కన్న, అతని భార్య శారదమ్మలను రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పరామర్శించారు. కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.