65 మందికి వైద్య పరీక్షలు

AKP: నాతవరం ఎస్సీ కాలనీలో గురువారం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎం.రాజేశ్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో జలుబు, కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయని సమాచారం మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో మొత్తం 65 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.