మిత్ర యాప్ ద్వారా సమస్యలు పరిష్కారం: కమిషనర్
కృష్ణా: మిత్ర యాప్ ద్వారా స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మిత్ర యాప్ ద్వారా 122 నగరపాలక సంస్థ సంబంధించిన సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదులు, పన్ను చెల్లింపులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.