మహిళకు ప్రసవం చేసిన 108 సిబ్బంది.. తల్లి, బిడ్డ క్షేమం
MBNR: మూసాపేట్ (మం) నందిపేటకు చెందిన గర్భిణి గౌరమ్మ (26)కి నొప్పులు రావడంతో నిన్న రాత్రి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌ని సంప్రదించారు. అయితే నొప్పులు అధికం కావడంతో అప్రమత్తమై 108 సిబ్బంది EMT గోపికాంపిత్, పైలెట్ జానకిరామ్ ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. 108 సిబ్బంది సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.