నేడు అనంతపురంలో 'బడ్జెట్ అవుట్‌రీచ్'
ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు 'బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం' నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. జిల్లా అభివృద్ధి, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు.