ప్రజాపాలనతోనే ప్రగతి: కలెక్టర్
SRPT: క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు తీయించేందుకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. గురువారం రవి ఫంక్షన్ హాల్‌లో 99 రోజుల కార్యాచరణపై నిర్వహించిన అవగాహన సదస్సును ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాకారం చేయాలని అన్నారు.