ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
KNR: పోషణ పక్వాడలో భాగంగా కరీంనగర్ రేకుర్తిలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీడీపీఓ సబిత మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో ఆటపాటలతో కూడిన బోధన పిల్లల శారీరక, మేధో వికాసానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. 3-6 ఏళ్లలోనే మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని, తల్లిదండ్రులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.