ఫైనల్ మ్యాచ్.. అమిత్ షా సందడి

ఫైనల్ మ్యాచ్.. అమిత్ షా సందడి

టీ20 ప్రపంచ కప్‌‌లో భాగంగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. తన మనుమరాలితో కలిసి సందడి చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియంలో ఉన్నారు. 'ఇండియా.. ఇండియా' అంటూ మైదానం హోరెత్తుతోంది.