ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పద్మావతి

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.