VIDEO: నగరంలో పలుచోట్ల వర్షం
మేడ్చల్: నగరంలో పలు చోట్ల భారీగా వర్షం పడుతోంది. మల్లాపూర్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, రానున్న మరికొన్ని గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైడ్రాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.