పశ్చిమాసియాకు మరో 1000 మంది బలగాలు

పశ్చిమాసియాకు మరో 1000 మంది బలగాలు

ఇరాన్‌పై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అలాగే, పౌర అణు ఇంధనశక్తిని పెంపొందించుకునే కార్యక్రమాలకు సాయం అందిస్తామని తెలిపింది. అయితే, ఓవైపు శాంతి ప్రణాళికను ఆఫర్ చేస్తూ పశ్చిమాసియాకు అమెరికా బలగాలను పంపించేందుకు సిద్ధమైంది. మరో 1000 మంది సైన్యంతో పాటు రెండు మెరైన్ యూనిట్లను మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది.