నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: బోనకల్ మండలంలోని కలకోట ఫీడర్ పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 11 కేవీ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ శాఖ ఏఈ తోకల మనోహర్ తెలిపారు. ఈ అంతరాయం కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు వర్తిస్తుందని, కావున వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.