కూటమి పాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య

కూటమి పాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఉపాధ్యాయులు సన్మానించారు.