రూ.1.88 కోట్లకు ఐపీ దాఖలు చేసిన వ్యాపారి

రూ.1.88 కోట్లకు ఐపీ దాఖలు చేసిన వ్యాపారి

ఖమ్మంలోని రస్తోగినగర్ ప్రాంతానికి చెందిన తాళ్లూరి వెంకటేశ్వరరావు కూరగాయలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నష్టపోయి రూ.1.88 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురవడంతో న్యాయవాది ఆనం చిన్ని రామారావు ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌లో 12 మందిని ప్రతివాదులుగా చేర్చినట్లు పేర్కొన్నారు.