RTC డిపో వద్ద ఉద్రిక్తత
జనగామ జిల్లా RTC డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కార్మికుల సమ్మెను అడ్డుకున్నారు. అనంతరం ధర్నాకు అనుమతి లేదని పోలీసులు టెంట్లను తొలగించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. దీంతో పోలీసుల తీరుపై RTC కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.