స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో VIVO!

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో VIVO!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. వివో మార్కెట్‌ వాటా పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఒప్పో రెండో స్థానంలో.. శాంసంగ్‌ మూడో స్థానంలో ఉన్నాయి. రియల్‌మీని వెనక్కి నెట్టి యాపిల్‌ నాలుగో స్థానానికి చేరినట్లు IDC నివేదిక తెలిపింది. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్ టాప్‌ స్థానాన్ని సాధించింది.