ఏటీఎంలను పరిశీలించిన సీఐ

ఏటీఎంలను పరిశీలించిన సీఐ

ప్రకాశం: కంభం సీఐ మల్లికార్జునరావు సోమవారం రాత్రి కంభంలోని వివిధ ATMలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ATMల భద్రతా ఏర్పాట్లు, CC కెమెరాల పనితీరు, లైటింగ్ సదుపాయాలు, నగదు భద్రత వంటి విషయాలను పరిశీలించారు. ప్రజలు రాత్రి వేళల ATMలనూ ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.