‘చొరబాటుదారులకు తావులేదు.. 'మోదీ గ్యారంటీ'’

‘చొరబాటుదారులకు తావులేదు.. 'మోదీ గ్యారంటీ'’

అసోంలోని ధేమాజీలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. విదేశీయులను ఇక్కడ స్థిరపడేలా చేస్తూ, స్థానికులను మైనారిటీలుగా మార్చాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. రైతులు, గిరిజనుల భూములను, అడవులను చొరబాటుదారుల పరం కానివ్వబోమని.. అక్రమ ఆక్రమణలపై తమ ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని, అది 'మోదీ గ్యారంటీ' అని ఆయన హామీ ఇచ్చారు.